ATP: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో ప్రతి ఓటును కాపాడుకోవడం అత్యంత కీలకమని మాజీ మంత్రి, శింగణమల నియోజకవర్గ సమన్వయకర్త డా. సాకే శైలజానాథ్ అన్నారు. నార్పలలో మంగళవారం నిర్వహించిన వైసీపీ బూత్ కమిటీల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిస్తే పోరాటం చేపడతామని హెచ్చరించారు.