E.G: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ ప్రక్రియ పై వైసీపీ నీచ రాజకీయాలు చేస్తుందని నిడదవోలు ఐటీడీపీ అధ్యక్షులు అబ్బిశెట్టి సత్తిరాజు మండిపడ్డారు. మంగళవారం నిడదవోలులో ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క డీఎస్సీ నిర్వహించకుండా నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. కానీ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉందన్నారు.