BHNG: తెలంగాణ ఉద్యమానికి జిట్టా బాలకృష్ణారెడ్డి ఓ దిట్టగా నిలిచారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాడుతూ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించారు. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలంగాణ ఆకాంక్షను బలంగా వినిపించిన నాయకుల్లో ఆయన ఒకరు. సభలు, పాదయాత్రలు, నిరసన కార్యక్రమాల ద్వారా ఉద్యమాన్ని ప్రజలకు చేరువ చేశారు. తెలంగాణ కోసం అంకితభావంతో పనిచేశారు