ADB: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం దేశానికి ఆదర్శమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని 42వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను అందజేశారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలి అన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.