GDWL: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం గద్వాల పరేడ్ గ్రౌండ్లో బాలభవన్, దివ్య, రెబల్ అకాడమీ చిన్నారుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను అలరించాయి. అనంతరం ప్రజాపాలన కార్యాచరణలో విశేష కృషి చేసిన అధికారులకు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి జితేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు.