MHBD: చిన్నగూడూరు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జాతీయ జెండాకు అవమానం జరిగిన ఘటన చోటుచేసుకుంది. కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా అనుకోకుండా క్రిందికి జారిపోవడంతో తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.