AKP: జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 139 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి వినోద్ బాబు తెలిపారు. 2,531 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 2,392 మంది హాజరైనట్లు తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.