TG: జనసేన పార్టీ వేసిన హౌజ్‌మోషన్ పిటిషన్‌ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. హైదరాబాద్‌లో తాము నిర్వహించే సభకు అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా, జనసేన సభకు అనుమతి ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఈ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో జనసేన సభ రద్దయ్యే అవకాశం ఉంది.