MBNR: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేశామని ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని పదవులను త్యాజించామని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని జడ్చర్లలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కావేరమ్మపేటలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి హాజరయ్యారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.