ASR: జిల్లాకు చెందిన ఎస్టీ నాయక్ కులానికి చెందిన అర్హులకు కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సీపీఎం పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి అప్పలనర్స సోమవారం తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి అనుగుణంగా రెండు విడతల్లో సర్టిఫికెట్లు జారీ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.