BDK: ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని 32 గిరిజన గురుకులాలకు కూరగాయలు, మాంసం, క్యాటరింగ్, శానిటేషన్ సేవల కోసం ఐటీడీఏ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీవో రాహుల్ సోమవారం ప్రకటించారు. ఆసక్తి గల వారు ఇవాళ్టి నుంచి 5వ తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలని ఆయన తెలిపారు. టెండర్లను 6న ఉదయం 11 గంటలకు తెరుస్తారు. ఎస్సీ, ఎస్టీలకు ఈఎండీలో 40% రాయితీ ఉంటుందనన్నారు.