SRPT: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఇవాళ జరుగనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం రాత్రి విద్యుత్ దీపాల కాంతులతో సుందరంగా ముస్తాబైంది. కలెక్టరేట్లో ఇవాళ జాతీయ జెండాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. విద్యుత్ దీపాలతో వెలుగుతున్న కలెక్టరేట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.