WGL: వరంగల్ బాలసముద్రం,టైలర్ స్ట్రీట్ ప్రాంతాల్లో సోమవారం ఏకకాలంలో పోలీసుల మెరుపు దాడులు నిర్వహించారు. కిరాణా దుకాణాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 75 వేల విలువైన గుట్కా సీజ్ చేశారు. అలాగే బాలసముద్రంలోని ఆకుల శ్రీనివాస్ దుకాణంలో రూ. 23 వేల గుట్కా ప్యాకెట్లు, టైలర్ స్ట్రీట్ లోని మహాదేవ్ జనరల్ స్టోర్ లో రూ. 52 వేల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.