అన్నమయ్య: మదనపల్లి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ కూటమి ప్రభుత్వంపై సోమవారం తీవ్ర విమర్శలు గుప్పించారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పూర్తిగా విఫలమయ్యారని, డీఎస్సీ నియామక ప్రక్రియలో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.