భారత్-ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య రేపు కీలకమైన మూడో టీ20 జరగనుంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఇరుజట్లు చెరో విజయంతో సమంగా ఉన్నాయి. దీంతో ఈ చివరి మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకోవాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 11 గంటలకు ప్రారంభం కానుంది. సోనీ స్పోర్ట్స్ ఛానళ్లలో లేదా SonyLiv యాప్లో ఈ మ్యాచ్ను లైవ్లో చూడవచ్చు.