RR: నూతనంగా చేవెళ్ల ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన బన్సీలాల్ను చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామ సర్పంచ్ పామేన రాములు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు, నాయకులు పాల్గొన్నారు.