KMM: మధిర మున్సిపల్ కమిషనర్‌గా సోమవారం సామ్యూల్ బెన్డిక్ట్ ఇస్రాయిల్ పాల్ భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్‌ను మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాత మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆశయాలకు అనుగుణంగా మధిర మున్సిపాలిటీ అభివృద్ధిలో పాటుపడాలని కమిషనర్‌కు చైర్ పర్సన్ సూచించారు.