NRML: ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) డిమాండ్ చేసింది. సోమవారం తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ పోస్టర్, కరపత్రాలను ఐబీ గెస్ట్ హౌస్లో నాయకులు ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 5న హైదరాబాద్లో జరిగే ధర్నాను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని కోరారు.