SKLM: కంచిలి మండలం బైరిపురంలో రూ.3 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన 80 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణ పనులకు టీడీపీ మండల అధ్యక్షుడు రామారావు సోమవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్య వసతుల కల్పనకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్ణ, శ్రీను, హరి, చంద్రయ్య, ధర్మ, దుర్యోధన, భగవాన్ ఉన్నారు.