KRNL: పెరిగిన రసాయనిక ఎరువుల ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని రైతు సంఘం డిమాండ్ చేసింది. ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో ఇవాళ ఆదోనిలో ఎమ్మార్వో కార్యాలయం ముందు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. కౌలు రైతులకు పంట రుణాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై అందించాలని కోరారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మార్వోకు సమర్పించారు.