PPM: గుమ్మలక్ష్మీపురంలో గ్రంథాలయం వీధిలో సోమవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ఓ భారీ వృక్షం నేలకొరిగి పక్కనే ఉన్న ఇంటిపై పడింది. చెట్టు విద్యుత్ వైర్లపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఘటన సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదంతప్పిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.