NLG: కనగల్ మండలం ధర్వేశిపురం ప్రసిద్ధ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఇవాళ అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు నాగోజు మల్లాచారి అమ్మవారిని రంగురంగుల పూలమాలలు, ఆభరణాలు, పసుపు పచ్చని నిమ్మకాయల దండలతో అత్యంత నయనమనోహరంగా అలంకరించారు. సోమవారం కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు.