RCB కెప్టెన్ రజత్ పటీదార్ అరుదైన రికార్డు సృష్టించాడు. IPL చరిత్రలో వరుసగా రెండు సీజన్లలో జట్టును ఛాంపియన్గా నిలిపిన మూడో కెప్టెన్గా చరిత్ర నెలకొల్పాడు. దీంతో ధోనీ, రోహిత్ సరసన నిలిచాడు. 2010, 2011 సీజన్లలో CSKను వరుసగా ఛాంపియన్గా నిలిపి ధోనీ ఈ రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత 2019, 2020లో ముంబైకి IPL టైటిల్ అందించిన సారథిగా రోహిత్ ఈ జాబితాలో చేరాడు.