SDPT: జగదేవపూర్‌లో స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను సర్పంచ్ పనగట్ల శ్రీనివాస్ గౌడ్ పంపిణీ చేశారు. పేద కుటుంబాల్లోని ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఈ పథకాలు కొండంత అండగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు.