అన్నమయ్య: హార్స్లీ హిల్స్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. ఆదివారం ప్రత్యేక తనిఖీల్లో రూ.52 వేల జరిమానాలు విధించి, 13 వాహనాలపై కేసులు నమోదు చేసి కొన్ని వాహనాలను సీజ్ చేశారు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మోడిఫైడ్ సైలెన్సర్ల వినియోగంపై రాజీ లేదని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ హెచ్చరించారు.