WGL: భద్రకాళి ఆలయంలో ఇవాళ తెల్లవారుజామున అర్చకులు అమ్మవారికి పంచామృతాలతో విశేష అభిషేకాలు చేశారు. అమ్మవారి దివ్య దర్శనం కోసం నగరవాసులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా, దర్శనానంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.