ఖమ్మం జిల్లా రవాణా శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మల్టీజోన్-1, 2 పరిధిలోని పలువురు మోటార్ వాహన తనిఖీ అధికారులు (MVI), సహాయ తనిఖీ అధికారులను (AMVI) బదిలీ చేస్తూ రవాణా శాఖ కమిషనర్ డాక్టర్ కె.ఇలంబరితి మే 31న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, పరిపాలనా సౌలభ్యం, కోసం ఈ ప్రక్రియ చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.