SRD: సదాశివపేట మండలం తంగడపల్లి గ్రామ శివారులో పులి సంచరిస్తుందని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ శివారులో చిరుత పులి ఆనవాళ్లు కనిపించినట్లు సర్పంచ్ శేఖర్ తెలిపారు. వారం రోజుల నుంచి ఫారెస్ట్ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. రాత్రి సమయంలో గ్రామస్తులు ఎవరు కూడా ఒంటరిగా బయటకు వెళ్ళవద్దని సర్పంచ్ కోరారు.