WG: పోడూరు మండలం పెనుమదం గ్రామానికి చెందిన గుబ్బల వైష్ణవిపై ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పేరుపాలెం నుంచి బైక్పై తిరిగి వస్తుండగా, రామన్నపాలెం ఆకనవారి తోట సమీపంలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెను అడ్డగించి, బ్యాగును లాక్కెళ్లారు. అందులో 4 కాసుల బంగారు ఆభరణాలు ఉన్నట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.