KKD: కరపకు చెందిన మేదరమాటి పవన్ విష్ణుకిరణ్ అమెరికాలో అరుదైన ఘనత సాధించారు. మెటీరియల్ సైన్స్‌లో ప్లాస్టిక్ రీసైక్లింగ్‌పై ఆయన చేసిన ప్రయోగానికి గాను గోల్డ్ మెడల్ పొందారు. ఈ విషయాన్ని ఆదివారం గుర్తించిన పలువురు నేతలు, స్థానికులు.. విష్ణుకిరణ్ తన ప్రయోగంతో కరప ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లారని అభినందించారు.