E.G: రాజమండ్రి పోలీసులు రౌడీషీటర్లకు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా రాజమండ్రి ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్లో CI బాజిలాల్.. రౌడీషీటర్లను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.