కృష్ణా: అప్పులు తీర్చే విషయంలో జరిగిన వాగ్వాదంతో మనస్తాపం చెందిన దంతపులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అవురిపూడికి చెందిన మేడిశెట్టి పాండురంగారావు, రేణుకమ్మ పురుగుల మందు తాగినట్లు స్థానికులు తెలిపారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.