TDP Counter to YS Jagan: జగన్! వాస్తవాలివీ… తెలుసుకో
గుంటూరు జిల్లాలో రైతు భరోసా పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నీ అబద్దాలు చెప్పారని, అసలు వాస్తవాలను దాచి, తామేదో చేసినట్లు చెప్పుకుంటున్నారని తెలుగు దేశం పార్టీ విమర్శలు గుప్పించింది.
గుంటూరు జిల్లాలో (Guntur district) రైతు భరోసా (Rythu Bharosa) పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో (Public Meeting) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (Chief Minister of Andhra Pradesh) వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) అన్నీ అబద్దాలు చెప్పారని, అసలు వాస్తవాలను దాచి, తామేదో చేసినట్లు చెప్పుకుంటున్నారని తెలుగు దేశం పార్టీ (Telugu Desam) విమర్శలు గుప్పించింది. ఆయన అన్నీ అర్ధసత్యాలు చెప్పారని, విద్వేషం నిండిన మాటలు కనిపించాయని తెలిపింది. గతంలోని చంద్రబాబు (Chandrababu Naidu) ప్రభుత్వంపై విషం కక్కారని ధ్వజమెత్తారు. రైతులకు (Farmers) తానేదో చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారని, కానీ అసలు వాస్తవాలు ఇవి అంటూ తెలుగు దేశం పార్టీ (Telugu Desam) ఓ ప్రకటన విడుదల చేసింది. జగన్ (YS Jagan) చెప్పిన దానికి, అసలు వాస్తవానికి తేడా ఉందని, దీనిని ప్రజలు గుర్తించాలని కోరుతూ.. వివరాలను విడుదల చేసింది.
తానే ఇంగ్లీష్ మీడియం (English Medium) ప్రవేశ పెట్టినట్లు జగన్ (YS Jagan) చెప్పారని, వాస్తవానికి దీనిని చంద్రబాబు ప్రవేశ పెట్టారని తెలిపారు. టీడీపీ హయాంలోనే ఇంగ్లీష్ మీడియం విద్య ప్రారంభమైనట్లు చెప్పారు. అదే సమయంలో ఉద్యోగాల గురించి కూడా స్పందించింది టీడీపీ. చంద్రబాబు హయాంలో ఏడు డీఎస్సీల (DSC) ద్వారా 1.5 లక్షల మందిని నియమించిందని, కానీ జగన్ వచ్చి నాలుగేళ్లు కావొస్తున్న ఒక్క డీఎస్సీ వేయలేదని విమర్శించింది.
చంద్రబాబు ఎలాంటి సంక్షేమ పథకాలు (welfare schemes) ప్రవేశ పెట్టలేదని, తనలా ప్రజల గురించి ఎందుకు ఆలోచించలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారని గుర్తు చేసిన టీడీపీ, అసలు తాము తీసుకు వచ్చిన ఎన్నో పథకాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిన విషయం ప్రజలు గుర్తిస్తారని పేర్కొన్నది. గత ప్రభుత్వం తీసుకు వచ్చిన 157 పథకాలను (welfare schemes) వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపింది. చివరకు పేదలకు రూ.5కే అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను (Anna Canteen) కూడా మూసివేయించారన్నారు. తమ పాలనలో అయిదేళ్లలో సగటు బడ్జెట్ రూ.1.41 లక్షలు కాగా, సంక్షేమం కోసం మొదటి మూడేళ్లలోనే రూ.2 లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పారు. జగన్ పాలనలో సగటు బడ్జెట్ రూ.2.30 లక్షలు కాగా, మొదటి మూడేళ్ళలో రూ.1.45 లక్షలు మాత్రమే వెచ్చించినట్లు తెలిపారు.
రైతు భరోసా ద్వారా రూ.27 వేల కోట్లను అందించినట్లు జగన్ గుంటూరు సభలో చెప్పారని, కానీ నాలుగేళ్లలో ఇచ్చింది రూ.15 వేల కోట్లు మాత్రమేనని టీడీపీ స్పష్టం చేసింది. అయిదేళ్ల కాలంలో ఒక్కో రైతుకు రూ.37500 మాత్రమే ఇస్తున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. కానీ టీడీపీ హయాంలో రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ ద్వారా ఒక్కో రైతుకు రూ.50 వేల నుండి 1 లక్ష రూపాయల వరకు లబ్ధి చేకూరిందన్నారు. అప్పుడు అయిదేళ్లలో 21వేల కోట్లు ఇచ్చినట్లు చెప్పారు.
రైతులకు పెట్టుబడి సాయం కింద తామేదో ఇస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం చెబుతోందని, కానీ ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ఏడాదికి ఇచ్చే రూ.6 వేలను కూడా తమ ఖాతాలో వేసుకుంటున్నారని టీడీపీ మండిపడింది. పీఎం కిసాన్ ను (PM Kisan) తాము ఇచ్చినట్లు కలరింగ్ ఇచ్చుకోవడమే ఇందుకు నిదర్శనమని తెలిపింది. ఈ ఏడాది ఖరీఫ్ లో 80 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, 33 లక్షల టన్నులు మాత్రమే ప్రభుత్వం సేకరించిందని ఆరోపించింది. చంద్రబాబు హయాంలో వారం రోజుల్లోనే ధాన్యానికి డబ్బులు చెల్లించేవారమని, ఇప్పుడు నెలలు గడుస్తోందన్నారు. మద్దతు ధర కూడా దక్కడం లేదన్నారు. నాలుగేళ్లుగా వర్షాలు పడుతున్నా ఊళ్లకు ఊళ్లే ఖాళీ అవుతున్నాయని టీడీపీ ఆరోపించింది. కానీ జగన్ మాత్రం కరువు అనే మాట లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నది.