SRCL: ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడంలో జాప్యం చేయవద్దని సూచించారు. రోజువారీ కొనుగోళ్లు పెంచడం, లోడింగ్, అన్లోడింగ్, ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీలను వేగవంతం చేయాలని తెలిపారు.