SRD: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మాజీ MLC రాములు నాయక్ సూచించారు. ఈ ప్రక్రియలో భాగంగా లంబాడి, ఆదివాసి, దళిత, మైనారిటీలు, వలస కార్మికులు, మహిళాల ఓట్లు అక్రమంగా తొలగించే ప్రమాదముందని అన్నారు. క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటును కాపాడాలని పార్టీ శ్రేణులను పిలుపునిచ్చారు.