SRD: కంగ్టి మండలం బోర్గిలో నిర్మించిన రైతు వేదిక శిథిలావస్థకు చేరింది. గ్రామానికి కిలోమీటర్ దూరంలో గట్టుపై గతంలో ఈ భవనాన్ని నిర్మించారు. రైతులందరికీ ఒకచోట చేర్చి వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఈ భవనాన్ని ఉపయోగంలోకి తెచ్చారు. అయితే గతంలో నాసిరకం పనులు చేపట్టడంతోనే దుస్థితికి చేరిందని రైతులు నేడు తెలిపారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు.