MBNR: కౌకుంట్ల మండల కేంద్రంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. పూరిగుడిసెల్లో కాలం వెళ్లదీసిన తమకు ఇళ్లు మంజూరు కావడంపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఎటువంటి పైరవీలు లేకుండా నేరుగా అకౌంట్లలో డబ్బులు వేయడం ప్రజాపాలనకు నిదర్శనమని సర్పంచ్ నరేష్ కుమార్ అన్నారు.