RR: లారీ ఇంజన్లో మంటలు చెలరేగిన ఘటన అంతారం వద్ద చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. SDNR నుంచి షాబాద్‌కు లారీ వెళుతుండగా అంతారం గేట్ వద్ద అకస్మాత్తుగా లారీఇంజన్లో మంటలు చెలరేగాయి. గమనించిన లారీ డ్రైవర్ రోడ్డు పక్కన వాహనాన్ని ఆపారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.