ఎన్టీఆర్: కంచికచర్ల పట్టణంలోని అంబేద్కర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో బర్రె శంకర్రావు ఆధ్వర్యంలో శనివారం పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచిత ఎగ్జామ్ కిట్లను మండల టీడీపీ అధ్యక్షులు కోగంటి బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసి, అత్యుత్తమ మార్కులు సాధించాలని ఆకాంక్షించారు.