ATP: గుత్తి శ్రీ వాసవి కనకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాజుల గౌరమ్మ పూజ ఘనంగా నిర్వహించారు. 102 మంది ఆర్యవైశ్య మహిళలు ఈ పూజలో పాల్గొన్నారు. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రంగు రంగుల గాజులను, పూలను సమర్పించి అలంకరించారు. ఈ పూజ చేస్తే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తులను నమ్మకమని అర్చకులు తెలిపారు.