రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ మూవీ తెరకెక్కించిన విషయం తెలిసిందే. జూన్ 4న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ అయింది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా జూన్ 1న సాయంత్రం 5 గంటలకు ఈ ఈవెంట్ జరగనున్నట్లు మూవీ టీమ్ SM వేదికగా వెల్లడించింది.