BPT: చీరాల మండలం తోట వారి పాలెంలో గత రాత్రి వీచిన బలమైన గాలులకు విద్యుత్ వైర్ తెగి కింద పడింది. అయితే ఇప్పటివరకు విద్యుత్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అయితే తెగిపడిన విద్యుత్ వైర్లో కరెంట్ సప్లై ఉందో లేదో తెలియాల్సి ఉంది.