అన్నమయ్య: జిల్లా మదనపల్లి మండలం వెంకప్పకోట వద్ద ఎన్హెచ్-71 రహదారి పనుల్లో పెండింగ్లో ఉన్న పరిహార చెల్లింపుల అంశాలను జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ పరిశీలించారు. ప్రభావిత రైతులకు న్యాయం జరిగేలా పారదర్శకంగా పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి రహదారి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సూచించారు.