ASR: గిరిజన ప్రాంత ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు అందడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పాడేరులో అధికారులతో సమావేశమయ్యారు. గతంతో పోలిస్తే వైద్య సేవలు గణనీయంగా పెరిగాయన్నారు. దాదాపు 130శాతం వృద్ధి నమోదైందని తెలిపారు. గతంలో నెలకు 1.5లక్షల మంది రోగులు వస్తుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 2.5 లక్షలకు చేరిందన్నారు.