ప్రముఖ నటుడు జగపతి బాబు తన కరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. యంగ్ హీరో వైష్ణవ్ తేజ్, బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘ఉప్పెన’ మూవీలో హీరోయిన్ తండ్రి పాత్రను మిస్ చేసుకున్నట్లు తెలిపాడు. ఆ రోల్ కోసం చెప్పడానికి బుచ్చిబాబు తన ఇంటి గేట్ వరకు వచ్చి వెనక్కి వెళ్లిపోయాడన్నాడు. అయితే ఆ రోల్కి విజయ్ సేతుపతి అయితే బాగుంటుందని చెప్పాడని, ఆ నిజాయితీ నచ్చిందన్నాడు.