రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా దర్శకుడు బుచ్చిబాబు ‘పెద్ది’ మూవీ తెరకెక్కించాడు. జూన్ 4న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. AP విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా జూన్ 1న ఈ ఈవెంట్ జరగనున్నట్లు ఓ పోస్టర్ SMలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాకు AR రెహమాన్ మ్యూజిక్ అందించారు.