సినీ నటుడు అక్కినేని నాగచైతన్య తన ‘వ్యక్తిత్వ హక్కుల’ పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, వాయిస్, ఇమేజ్లను వాణిజ్య ప్రకటనలు, ఇతర అవసరాలకు వాడకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశాడు. గతంలో అమితాబ్, అనిల్ కపూర్, రజినీకాంత్ వంటి వారు కూడా ఇలాంటి హక్కుల కోసం కోర్టును ఆశ్రయించి రక్షణ పొందారు.