విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘రణబాలి’, ‘రౌడీ జనార్ధన’ చిత్రాలతో బిజీగా ఉంటూనే, శౌర్యవ్ దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేశాడు. తాజాగా విక్రమ్ కె కుమార్ చెప్పిన కథ నచ్చడంతో ఆయనతోనూ సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడట. అయితే, తొలుత ఈ ప్రాజెక్ట్ నిర్మించాలనుకున్న యూవీ క్రియేషన్స్ తప్పుకోవడంతో, బాలీవుడ్ సంస్థ ‘మ్యాడ్డాక్ ఫిల్మ్స్’ నిర్మించే ఛాన్స్ ఉందనే చర్చ నడుస్తోంది.