HYD: అభయారణ్యాల్లో పెరుగుతున్న పర్యాటకం ఆడపులుల సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతోందని హైదరాబాద్ సీసీఎంబీ–లాకోన్స్ సంయుక్త అధ్యయనం వెల్లడించింది. పర్యాటక ప్రాంతాల్లో సంచరించే పులుల్లో ఒత్తిడి హార్మోన్లు అధికంగా ఉన్నాయని గుర్తించారు. సఫారీ వాహనాల రద్దీ, మానవ జోక్యం కారణంగా పులుల సహజ జీవనం దెబ్బతింటోందని శాస్త్రవేత్తలు తెలిపారు.