కోనసీమ: రామచంద్రపురం పట్టణంలోని గుబ్బలవారి పేట ఐదు వార్డులకు చెందిన 30 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ హరీష్ మాధుర్, జిల్లా టీడీపీ అధ్యక్షులు గుత్తుల సాయి సమక్షంలో వారు టీడీపీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరినీ నాయకులు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.